పోలీసు అధికారులకు దక్షత పతకాలు: ఏపీ నుంచి నలుగురికి కేంద్రం గుర్తింపు
రిపోర్టర్: సతీష్
స్థలం: అమరావతి
నేరాల దర్యాప్తులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆంధ్రప్రదేశ్ కు చెందిన నలుగురు పోలీసు అధికారులకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దక్షత పతకాలను ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఈ పతకాలను వెల్లడించింది. రాయదుర్గం సీఐ కొరివి వెంకటరమణ, ధర్మవరం సీఐ జె.జయానాయక్, వేమూరు సీఐ నఫీజ్ బాషా, కనేకల్ ఎస్సై వై.నాగమధు ఈ అరుదైన పురస్కారాలను దక్కించుకున్నారని అధికారులు పేర్కొన్నారు.