తిరుమలాయపాలెంలో మంత్రి పొంగులేటి అనుచరుడి కారుపై రాళ్ల దాడి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: తిరుమలాయపాలెం
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుద్దవాగుతండా గ్రామ శివారులో సోమవారం రాత్రి మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రామసహయం నరేష్ రెడ్డి కార్లపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. మండలంలోని వివిధ గ్రామాల్లో గణేష్ మండపాల వద్ద పూజల్లో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.