హైదరాబాద్‌లో కొత్త బీఎండబ్ల్యూ కారును అడ్డుకుని రెండు లక్షల వసూలు

రిపోర్టర్: అశోక్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌లో కొత్తగా కొనుగోలు చేసిన బీఎండబ్ల్యూ కారును అడ్డుకున్న కొందరు వ్యక్తులు బలవంతంగా రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. ఆన్‌లైన్ ద్వారా క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులు పంపాలని ఒత్తిడి చేసిన ఈ తంతుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో స్థానికంగా కలకలం రేపింది. ఇలాంటి బలవంతపు వసూళ్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.