ఇండస్ట్రీ ఎవరి సొంతం కాదంటూ మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు
రిపోర్టర్: రమేష్
స్థలం: హైదరాబాద్
ది ప్యారడైజ్ చిత్ర విజయ వేడుకలో సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇండస్ట్రీ ఎవరి సొంతం కాదని, కేవలం ప్రతిభ, కష్టపడే తత్వం ఉన్నవారికే గుర్తింపు లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. కొంతమందికి డ్యాన్స్ మాత్రమే తెలుసని, నటనలో నవరసాలు పలికించడం అందరికీ సాధ్యం కాదని మోహన్ బాబు పేర్కొన్నారు. అయితే నానిలో మాత్రం అన్ని రసాలు పండించగలిగే సంపూర్ణ నటుడు ఉన్నాడని ఆయన కొనియాడారు.