హుస్నాబాద్ లో బిఆర్ఎస్ నిరసన.. ఎమ్మెల్యేలపై దాడికి నిరసనగా రాస్తారోకో
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: హుస్నాబాద్
అసెంబ్లీ వద్ద బిఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడిని ఖండిస్తూ హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బిఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో చేపట్టారు. ఈ నిరసనలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొని కార్యకర్తలతో కలిసి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళా నేతలపై జరిగిన అమానుష చర్యలకు ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలని సతీష్ కుమార్ డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యేలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడం దారుణమని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.