హిందీ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పిన కన్నడ హీరో శివరాజ్ కుమార్
రిపోర్టర్: మహేష్
స్థలం: కర్ణాటక
హిందీని జాతీయ భాష అనడంపై కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ క్షమాపణలు కోరారు. తన రాబోయే చిత్రం ప్రమోషన్ల సమయంలో పొరపాటున ఆ మాట అన్నానని, కన్నడ భాషతో పాటు అన్ని ప్రాంతీయ భాషలకు సమాన గౌరవం ఉందని ఆయన స్పష్టం చేశారు. హిందీ జాతీయ భాష కాదంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు రావడంతో ఆయన ఈ వివరణ ఇచ్చారు.