పోలీసు వ్యవస్థకు కానిస్టేబుళ్లే వెన్నెముక అంటూ హోంమంత్రి అనిత వ్యాఖ్య

రిపోర్టర్: కిరణ్ స్థలం: అమరావతి

పోలీసు విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. అమరావతిలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ కానిస్టేబుళ్లు పోలీసు వ్యవస్థకు వెన్నెముక అని ప్రశంసించారు. సిబ్బంది అందరూ అంకితభావంతో, ప్రజలకు అందుబాటులో ఉంటూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.