'మరో ఐదేళ్లు నేనే బాధ్యతలు': టాటా సన్స్ ఛైర్మన్‌గా ఎన్‌.చంద్రశేఖరన్ కొనసాగింపు

రిపోర్టర్: కృష్ణ స్థలం: మహారాష్ట్ర

టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఎన్‌.చంద్రశేఖరన్‌ను మరో ఐదేళ్ల పాటు కొనసాగించేందుకు టాటా సన్స్ బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. గురువారం నిర్వహించిన బోర్డు సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో తాను ఈ పదవిలో మూడోసారి కొనసాగడానికి ఇష్టపడట్లేదని ప్రకటించిన చంద్రశేఖరన్, బోర్డు ప్రత్యేక అభ్యర్థన మేరకు తాజాగా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఆయన ప్రస్తుత పదవీ కాలం ఫిబ్రవరి 2027తో ముగియనుండగా, తాజా ఆమోదంతో ఆయన మరో ఐదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.