హైడ్రాకు సుప్రీంకోర్టులో బిగ్ షాక్, పిటిషన్ డిస్మిస్

రిపోర్టర్: అశోక్ స్థలం: తెలంగాణ

శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. లోతుకుంటలోని 40 ఎకరాల భూమి వివాదంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించిన సర్వోన్నత న్యాయస్థానం, ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. ఈ తీర్పుతో హైడ్రా చర్యలకు గట్టి షాక్ తగిలినట్లయింది.