వైద్య సేవలను మరింత మెరుగుపరచాలని అధికారులను ఆదేశించిన ఖమ్మం కలెక్టర్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: ఖమ్మం
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను మరింత మెరుగుపరచడంతో పాటు, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నాణ్యమైన మరియు ఉచిత వైద్య సేవలు అందేలా వైద్యులు, సిబ్బంది ఎప్పుడూ అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. రోగుల ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.