చెంచు బావి బండ్లబాట ఆక్రమణలపై సీతారామపురం గ్రామస్థుల సమరభేరి

రిపోర్టర్: Durgam Syam స్థలం: సీతారామపురం

సీతారామపురం గ్రామంలో ఏడేళ్లుగా ఆక్రమణకు గురైన చెంచు బావి బండ్లబాటను వెంటనే పునరుద్ధరించాలని కోరుతూ గ్రామస్థులు రెవెన్యూ అధికారులకు దరఖాస్తులు అందజేశారు. పూర్వీకుల కాలం నుంచి వస్తున్న ఈ దారిని మూసివేయడం వల్ల వ్యవసాయ పనులకు, అంత్యక్రియలకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.