మహిళల రక్షణే లక్ష్యంగా షీ టీమ్స్ నిరంతరం శ్రమిస్తున్నాయన్న ఎస్సై హైమ

రిపోర్టర్: R.RAVINDER స్థలం: మంచిర్యాల

మహిళలు, విద్యార్థినిలకు రక్షణ, భద్రత కోసమే షీ టీమ్ లు పనిచేస్తున్నాయని షీ టీమ్ ఎస్సై హైమ తెలిపారు. బుధవారం లక్షెట్టిపేటలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో షీ టీమ్స్ పనితీరు గురించి విద్యార్థులకు వివరించారు. ఏదైనా ఆపద, సమస్య ఎదురైనప్పుడు వెంటనే డయల్ 100 నంబర్ ద్వారా అధికారులను సంప్రదించాలని ఆమె సూచించారు.