బ్రిక్స్ సదస్సు కోసం భారత్‌కు చేరుకున్న చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్
రిపోర్టర్: రాజేష్
స్థలం: New Delhi
భారత్‌లో జరిగే 18వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ నూతన దిల్లీకి చేరుకున్నారు. గల్వాన్ ఘర్షణల తర్వాత దాదాపు ఏడేళ్ల కాలంలో ఆయన భారత్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. తన అత్యంత సన్నిహితులు కాయ్ కి, వాంగ్ యీలతో కలిసి ఆయన పర్యటనకు రావడం, ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదలపై తీవ్ర ఆసక్తి నెలకొంది.