తమిళనాడులో మేనమామ బంగారు ఉంగరం పథకం ప్రారంభం

రిపోర్టర్: నరేష్ స్థలం: తమిళనాడు

తమిళనాడులో ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించిన ప్రతి చిన్నారికీ ఒక గ్రాము బంగారు ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చే మేనమామ బంగారు ఉంగరం పథకాన్ని ఈ నెల 28న సీఎం విజయ్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ ఏడాది జూన్ 22 నుంచి జన్మించిన శిశువులకు ఈ పథకం వర్తించనుండగా, తొలి విడత కోసం 1.28 లక్షల ఉంగరాలను సిద్ధం చేశారు. అయితే ఉప ఎన్నికలు జరిగే మదురాంతకం, ధారాపురం నియోజకవర్గాల్లో ఎన్నికల కోడ్ కారణంగా ఈ పథకానికి ఎన్నికల సంఘం తాత్కాలికంగా బ్రేక్ వేసింది.