ప్రియుడితో భార్యకు పెళ్లి చేసిన విశాల హృదయ భర్త
రిపోర్టర్: సునీల్
స్థలం: ఉత్తరప్రదేశ్
ఉత్తరప్రదేశ్లోని లక్నోలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. పెళ్లైన యువతి ప్రియుడితో పారిపోగా, భర్త ఆమెను వెతికిపట్టుకొచ్చాడు. అయితే ప్రియుడితోనే ఉంటానని భార్య తెగేసి చెప్పడంతో భర్త విక్కీ ఉదారత చాటుకున్నాడు. ఇరు కుటుంబాలతో చర్చించి గుడిలో ప్రియుడితో భార్యకు వివాహం జరిపించాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.