సిద్దిపేట ఆర్టీసి డిపో ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: రాము
స్థలం: సిద్దిపేట
సిద్దిపేట ఆర్టీసీ డిపోలో కార్మికులను నేలపై కూర్చోబెట్టి డీఎం కుర్చీలో కూర్చున్న ఘటనపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వివాదంపై స్పందించిన ఆయన, తక్షణమే పూర్తిస్థాయి విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. కార్మికుల ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తే సహించేది లేదని, బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించినట్లు అధికారులు తెలిపారు.