పాకిస్థాన్ పంజాబ్ లో మ్యాన్ హోళ్లలో సేఫ్టీ నెట్లు
రిపోర్టర్: మహేష్
స్థలం: World
పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో మ్యాన్ హోల్ మూతలు చోరీకి గురికావడం, ధ్వంసం కావడం వల్ల పౌరులు ముఖ్యంగా పిల్లలు పడిపోకుండా అధికారులు సరికొత్త భద్రతా చర్యలు చేపట్టారు. మ్యాన్ హోళ్ల లోపల రంగురంగుల సేఫ్టీ నెట్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రజల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ షరీఫ్ స్పష్టం చేశారు.