ఆసియా క్రీడల్లో అధికారిక హోటళ్లలోనే భారత క్రికెటర్ల బస
రిపోర్టర్: భాస్కర్
స్థలం: న్యూఢిల్లీ
ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత క్రికెటర్లు నిర్వాహకులు కేటాయించిన అధికారిక హోటళ్లలోనే బస చేయనున్నట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. ఫైవ్‌స్టార్ సదుపాయాలు లేకపోయినా, క్రీడాకారులు అక్కడే ఉండడానికి అంగీకరించినట్లు తెలిపారు. అలాగే బీ' టీమ్‌ను పంపుతున్నారనేది కేవలం వదంతులేనని, అత్యుత్తమ పూర్తి స్థాయి జట్టును బరిలోకి దంపుతున్నామని ఆయన తేల్చిచెప్పారు.