నాగర్‌కర్నూల్‌లో విద్యార్థి ఆత్మహత్య నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత

రిపోర్టర్: సునీల్ స్థలం: నాగర్‌కర్నూల్

నాగర్‌కర్నూల్ జిల్లాలో గురుకుల కళాశాల ఇంటర్ విద్యార్థి భరత్ ఆత్మహత్య కలకలం రేపింది. ఈ ఘటనపై తోటి విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు ఆటోలో తరలిస్తుండగా ఓవర్‌క్రాడింగ్ కారణంగా ఆటో ముందు టైర్ ఊడిపోయి ప్రమాదం తప్పుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.