రికార్డు స్థాయిలో ప్రసవాలతో కళకళలాడిన మాతా శిశు ఆసుపత్రి
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: మంచిర్యాల
మంచిర్యాలలోని మాతా శిశు ఆసుపత్రిలో శుక్రవారం రికార్డు స్థాయి ప్రసవాలు జరిగాయి. ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల మధ్య ఇరవై ఐదు ప్రసవాలు జరిగినట్లు వైద్యులు వెల్లడించారు. ఇందులో పదకొండు సాధారణ ప్రసవాలు, పద్నాలుగు సిజేరియన్ ప్రసవాలు ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా వైద్యుల బృందాన్ని జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్, ఆర్ఎం శ్రీధర్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న మెరుగైన వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.