పాలకులపై బురదజల్లుతున్న బీఆర్ఎస్ అబద్ధపు ప్రచారాలను ఎండగట్టాలి
రిపోర్టర్: kasanivenkatesh
స్థలం: నేలకొండపల్లి
ప్రజా సంక్షేమ పాలనను చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ నాయకులు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేత దయాకర్ రెడ్డి ధ్వజమెత్తారు. నేలకొండపల్లిలో మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రభుత్వం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బీఆర్ఎస్ నేతలు తోకముడిచారని ఎద్దేవా చేశారు. గతంలో కేసీఆర్ కుటుంబం మాత్రమే లబ్ధి పొందిందని, కాంగ్రెస్ హయాంలో సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని తెలిపారు.