బోయింగ్ విమాన ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఎఫ్ఐపి విజ్ఞప్తి

రిపోర్టర్: వెంకట్ స్థలం: New Delhi

ఎయిర్ ఇండియా బోయింగ్ విమాన ప్రమాద దర్యాప్తులో విద్యుత్ మరియు ఎలక్ట్రానిక్స్ ఆధారాలను సమగ్రంగా పరిశీలించాలని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ కోరింది. ఎఫ్ఐపి అధ్యక్షుడు కెప్టెన్ సి.ఎస్. రంధ్వా ఈ మేరకు విమానయాన భద్రతను పటిష్టం చేయడానికి సాంకేతిక సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరోకు విజ్ఞప్తి చేశారు. బోయింగ్ 787 విమానాల విద్యుత్ వ్యవస్థల సమస్యలపై గతంలో సమర్పించిన సాంకేతిక నివేదికలను పరిగణనలోకి తీసుకోవాలని కోరినట్లు అధికారులు తెలిపారు.