పెన్షనర్లకు కీలక అలర్ట్: నవంబర్ ముప్పైలోపు జీవన్ ప్రమాణ్ సర్టిఫికేట్ తప్పనిసరి

రిపోర్టర్: రాజేష్ స్థలం: తెలంగాణ

పెన్షన్ సజావుగా అందాలంటే పింఛనుదారులు నవంబర్ ముప్పైలోపు జీవన్ ప్రమాణ్ సర్టిఫికేట్ సమర్పించాలని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు. ఈ గడువులోగా లైఫ్ సర్టిఫికేట్ అందజేయకపోతే పింఛన్ చెల్లింపులు నిలిచిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎనుభై ఏళ్లు దాటిన వృద్ధులు అక్టోబర్ ఒకటి నుంచే డిజిటల్ విధానంలో లేదా బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా ఈ సర్టిఫికేట్ను సులభంగా సమర్పించవచ్చని అధికారులు వెల్లడించారు.