పాడి రైతులకు భరోసాగా త్వరలో విజయ డైరీ ఏర్పాటు

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట పరిసర గ్రామాల పాడి రైతులకు చేయూతనందించేందుకు త్వరలో విజయ డైరీని ఏర్పాటు చేయనున్నట్లు ఉమ్మడి నల్లగొండ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ప్రదీప్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ, తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సమైక్య ఆధ్వర్యంలో యువ పాడి రైతులకు గ్రామీణ బ్యాంకు ద్వారా రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. రాజపేట మండలంలో బల్క్ మిల్క్ కూలింగ్ పాయింట్ ఏర్పాటు చేసి సొసైటీల ద్వారా పాల సేకరణ చేపడతామన్నారు.