విజయనగరం మున్సిపల్ ఎన్నికలు: 65.33 శాతం పోలింగ్ నమోదుతో ప్రశాంతంగా ముగింపు
రిపోర్టర్: గోపి
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిందని, జిల్లావ్యాప్తంగా మొత్తం 65.33 శాతం ఓటింగ్ నమోదైనట్లు కలెక్టర్ విజయనగరం (Collector Vizianagaram) వెల్లడించారు. విజయనగరం కార్పొరేషన్ లో 62.73 శాతం, బొబ్బిలి మున్సిపాలిటీలో 71.30 శాతం, నెల్లిమర్ల నగర పంచాయతీలో 80.31 శాతం ఓట్లు నమోదయ్యాయని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.