మనుబోలులో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.. ఎంఈఓ సన్మానం

రిపోర్టర్: sankar p స్థలం: మనుబోలు

నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి హజరత్ అయ్యానును ఎస్బీఐ చీఫ్ మేనేజర్ ముజిబుల్ రహిమాన్ ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మేనేజర్ మాట్లాడుతూ, గురువు లేనిదే సమాజం లేదని, సమాజంలో నడవడికను నేర్పించే గురువు దైవంతో సమానమని కొనియాడారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర వెలకట్టలేనిదని ఆయన పేర్కొన్నారు.