కర్నూలు: కారుణ్య నియామకం కింద హోంగార్డు ఉద్యోగం అందజేత

రిపోర్టర్: రమేష్ స్థలం: Kurnool, Andhra Pradesh

కర్నూలు జిల్లాలో మానవీయ కోణంలో పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విధి నిర్వహణలో మరణించిన హోంగార్డు కే. కృష్ణ కుటుంబానికి అండగా నిలిచింది. కారుణ్య నియామకం కింద ఆయన భార్య సునీతకు హోంగార్డు ఉద్యోగ నియామక పత్రాన్ని ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఎస్. కృష్ణమోహన్ అందజేశారు. బాధిత కుటుంబానికి భరోసా కల్పించేలా పోలీసు శాఖ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.