నెల్లూరు జిల్లాలో ఘనంగా స్వచ్ఛత ప్రత్యేక కార్యక్రమాలు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో స్వైర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయం, డిటిసి మరియు అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు పోలీసులు, ఏఆర్ సిబ్బంది మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పరిసరాలను శుభ్రపరిచారు.