నాగచైతన్య వృషకర్మ సినిమా నుంచి స్వాగ్ ఆఫ్ అర్జున్ ఫస్ట్ సాంగ్ విడుదల

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

అక్కినేని నాగచైతన్య హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'వృషకర్మ' నుంచి 'స్వాగ్ ఆఫ్ అర్జున్' పేరుతో విడుదలైన ఫస్ట్ సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోందని చిత్రబృందం వెల్లడించింది. అజనీశ్ లోకనాథ్ సంగీతం అందిస్తూ స్వయంగా ఆలపించిన ఈ పాటలో నాగచైతన్య సరికొత్త స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు. డిసెంబర్ 4న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.