ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై రాహుల్ గాంధీ నిప్పులు
రిపోర్టర్: హరి
స్థలం: New Delhi
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ దేశంలో ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేలా మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేరళ మాజీ చీఫ్ సెక్రటరీ జైజీ థామ్సన్ ఇంటర్వ్యూను ఉటంకిస్తూ ఎక్స్ వేదికగా ఆయన ఈ ఆరోపణలు చేశారు. సర్వీస్‌లో ఉండగా జ్ఞానేశ్ కుమార్ బీజేపీ కోసం రిక్రూట్మెంట్కు పాల్పడ్డారని, మోదీ, షా కలిసి ఆయన్ను అంపైర్‌గా కూర్చోబెట్టి ఎన్నికలను మ్యాచ్ ఫిక్సింగ్ చేసే బాధ్యత అప్పగించారని రాహుల్ గాంధీ ఆరోపించారు.