ఘనంగా ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ ప్రారంభం
రిపోర్టర్: కిరణ్
స్థలం: చెన్నై
భారతరత్న ఎం.ఎస్.సుబ్బులక్ష్మి 110వ జయంతి సందర్భంగా ఆమె జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం చెన్నైలోని సంగీత అకాడమీలో అగ్ర నటుడు కమల్‌హాసన్ చేతుల మీదుగా ప్రారంభమైంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రష్మిక మందన్న ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ భారీ బయోపిక్‌ను అల్లు అరవింద్, రాక్‌లైన్ వెంకటేష్, బన్నీ వాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.