బుచ్చిరెడ్డిపాళెం అభివృద్ధికి మరోసారి ఆశీర్వదించండి: వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విజ్ఞప్తి

రిపోర్టర్: భాస్కర్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో నిర్వహిస్తున్న చెప్పాం చేస్తున్నాం ఇంటింటి ప్రచారంలో భాగంగా 28వ వార్డు రామచంద్రపురంలో పర్యటించి ప్రజలను కలుసుకున్నట్లు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ స్థానిక ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఆమె హామీ ఇస్తూ మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.