బాలల హక్కుల పరిరక్షణలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అత్యవసరం
రిపోర్టర్: R.RAVINDER
స్థలం: మంచిర్యాల
బాలల హక్కులు పరిరక్షణ, వారిపై జరిగే నేరాలను నివారించడం ప్రతి ఒక్కరి బాధ్యతని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి కవిత అన్నారు. మంగళవారం మంచిర్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో మాట్లాడుతూ బాలలపై లైంగిక నేరాలను అరికట్టడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సంబంధిత అధికారుల పాత్ర కీలకమని తెలిపారు. సమస్యలు ఎదురైనప్పుడు తమను సంప్రదించి న్యాయ సలహాలు పొందవచ్చని సూచించారు.