పెళ్లికి ముందే ప్రత్యేక కౌన్సిలింగ్: గోవా కాలేజీ కీలక నిర్ణయం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: గోవా

పెరుగుతున్న విడాకుల కేసులను అరికట్టేందుకు పెళ్లికి ముందే కౌన్సిలింగ్ ఇవ్వాలని నిర్ణయించినట్లు కాలేజ్ ప్రిన్సిపాల్ మహేష్ పాయ్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో గోవా కాలేజ్ ఆఫ్ హోమ్ సైన్స్ ఆధ్వర్యంలో పదిహేను రోజుల ప్రత్యేక సర్టిఫికేట్ కోర్సును ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. భాగస్వామిని అర్థం చేసుకోవడం, భావోద్వేగాల నిర్వహణపై యువతకు శిక్షణ ఇవ్వడమే ఈ వినూత్న కోర్సు ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.