కేబీసీలో 50 లక్షలు, యూపీఎస్సీలో ర్యాంకు సాధించిన వికాస్ సింగ్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: India

హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల వికాస్ సింగ్ పన్వార్ అరుదైన ఘనత సాధించారు. కేబీసీ సీజన్-17లో పాల్గొని రూ. 50 లక్షలు గెలుచుకోవడమే కాకుండా, మొదటి ప్రయత్నంలోనే యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలో ఆల్ ఇండియా 159వ ర్యాంకును కైవసం చేసుకున్నారు. సిమ్లాకు చెందిన వికాస్, ఢిల్లీలో చదువుకుంటూనే తన మేధస్సుతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఆయన పట్టుదల యువతకు స్ఫూర్తిదాయకం.