రామ్లీలా మైదానంలో విపక్షాల నిరసన ప్రదర్శనపై బీజేపీ తీవ్ర విమర్శలు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: New Delhi

న్యూఢిల్లీలోని రామ్లీలా మైదానంలో విపక్షాలు నిర్వహించిన నిరసన ప్రదర్శన పూర్తిగా విఫలమైందని బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ప్రసంగిస్తున్న సమయంలోనే మైదానం ఖాళీ అయిందని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అంచనా వేసినట్లుగా పది లక్షల మంది జనం రాలేదని, ట్రిక్ ఫోటోగ్రఫీతో జనాలను చూపించే ప్రయత్నం చేశారని విమర్శించారు. ఎన్నికలు ముగిసిన వెంటనే పిటిషన్ దాఖలు చేయకుండా, ఇప్పుడు ఇలా ఆరోపణలు చేయడం సరికాదని ఆయన స్పష్టం చేశారు.