నిరుద్యోగులకు భారీ షాక్: బీపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా వేసిన అధికారులు

రిపోర్టర్: సురేష్ స్థలం: Patna

అక్టోబర్ 25వ తేదీన జరగాల్సిన 72వ బీపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు బీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో నోటీసును పొందుపరిచారు. పరీక్ష వాయిదా పడటంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు కొత్త పరీక్ష తేదీని ప్రకటించకపోవడంతో అభ్యర్థులు తదుపరి ప్రకటన కోసం వేచి చూడాల్సి వస్తోంది. రిక్రూట్మెంట్లో భాగంగా మొత్తం 1,189 ఖాళీల భర్తీకి ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.