రూ.224 కోట్ల పెట్టుబడితో నల్లజర్లలో ఆయిల్పామ్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్: మంత్రి లోకేశ్

రిపోర్టర్: రాజేష్ స్థలం: తూర్పుగోదావరి

తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల వద్ద రూ.224 కోట్ల పెట్టుబడితో 3ఎఫ్ ఇంటిగ్రేటెడ్ ఆయిల్పామ్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు కానుందని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. ఈ ప్లాంట్ ద్వారా గోదావరి ప్రాంతంలోని వేలాది మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని, వారి ఆదాయాలు పెరుగుతాయని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతాన్నీ అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన వెల్లడించారు.