రామాయణం సినిమా నుంచి రంగులు రంగులే అందమైన పాట విడుదల

రిపోర్టర్: భాస్కర్ స్థలం: హైదరాబాద్

నమిత్ మల్హోత్రా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న రామాయణం చిత్రం నుంచి రంగులు రంగులే అంటూ సాగే అందమైన సంగీత కానుక విడుదలైనట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. శ్రీరాముడు సీతమ్మ ప్రేమకథను అద్భుతమైన విజువల్స్తో ఈ పాటలో ఆవిష్కరించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా రాఘవ్ కౌశిక్ వైశాలి సామంత్ గాత్రం అందించారు. రణ్బీర్ కపూర్ సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ పాటకు రాకేందు మౌళి తెలుగు సాహిత్యం అందించారని మేకర్స్ స్పష్టం చేశారు.