శ్రీశైలంలో భారీ ప్రక్షాళన చేస్తాం: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: విజయవాడ
దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని శ్రీశైల దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు విజయవాడలో కలిశారు. ఈ భేటీలో శ్రీశైలంలో మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనులు, క్యూ కాంప్లెక్స్ టెండర్లపై చర్చించారు. ఆలయంలో గత రెండేళ్లుగా అభివృద్ధి నిలిచిపోవడంపై చర్చించామని, త్వరలో శ్రీశైలంలో భారీ ప్రక్షాళన చేపట్టి అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామని మంత్రి స్పష్టం చేశారు.