ఈనాడు క్షమాపణలు: తప్పుడు వార్త ప్రచురణపై కేటీఆర్ లీగల్ నోటీసుల కలకలం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Hyderabad
ఏసీబీ కోర్టు పాస్పోర్ట్ సీజ్ చేయాలని ఆదేశించలేదని, ఈనాడు దినపత్రిక తప్పుడు వార్త ప్రచురించిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపినట్లు Telugu Scribe ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ లీగల్ నోటీసులతో దిగొచ్చిన పత్రికా యాజమాన్యం చరిత్రలోనే తొలిసారిగా తప్పుడు వార్త ప్రచురించినందుకు క్షమాపణలు కోరిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.