ఆధునిక పద్ధతులతో సుస్థిర సాగు చేపట్టాలన్న కలెక్టర్ ఆదర్శ్ సురభి
రిపోర్టర్: సురేష్
స్థలం: వనపర్తి
వనపర్తి జిల్లాలో నిర్వహించిన వ్యవసాయ కిసాన్ మేళాలో కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొని రైతులకు కీలక సూచనలు చేశారు. ఆధునిక సాంకేతికతను ఒడిసిపట్టుకుంటూ అన్నదాతలు సుస్థిర సాగు వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని, వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్, ఉద్యాన పంటల సాగును చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు.