పెదబయలు జీసీసీ నూతన మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టిన నాందోలి కొండబాబు
రిపోర్టర్: Thrinadh Rudi
స్థలం: పెదబయలు
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు నూతన జీసీసీ బ్రాంచ్ మేనేజర్‌గా జి.కె.వీధి బ్రాంచ్‌కు చెందిన నందోలి కొండబాబు నియామకమయ్యారు. ఈ మేరకు జీసీసీ మేనేజింగ్ డైరెక్టర్ స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో పెదబయలు బ్రాంచ్ మేనేజర్ సస్పెండ్ కావడంతో ఆ స్థానంలో కొండబాబును నియమించారు. గతంలో ముంచంగిపుట్టు జీసీసీ బ్రాంచ్‌లో విధులు నిర్వర్తించిన కొండబాబు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు సిబ్బంది సహకారంతో పెదబయలు బ్రాంచ్ అభివృద్ధికి మరియు గిరిజనుల సేవా సౌకర్యాలకు ప్రత్యేకంగా కృషి చేస్తానని తెలిపారు.