'ప్రపంచ స్థాయి విద్యే లక్ష్యం': రూ.25 కోట్లతో భోగాపురం స్కూల్ అభివృద్ధికి ప్రణాళిక
రిపోర్టర్: విజయ్
స్థలం: Bhogapuram
భోగాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలను అంతర్జాతీయ స్థాయి LEAP మోడల్ స్కూల్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి పాఠశాలను సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రూ.25 కోట్ల భారీ నిధులతో విద్యార్థులకు ప్రపంచ స్థాయి వసతులు కల్పించడమే లక్ష్యంగా ఈ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించినట్లు ఆమె వెల్లడించారు.