ఆరోగ్యానికి ముప్పుగా కల్తీ పనీర్: నాణ్యతను గుర్తించే సులభమైన చిట్కాలు ఇవే

రిపోర్టర్: కృష్ణ స్థలం: తెలంగాణ

శాకాహారులు ఎంతో ఇష్టంగా తినే పనీర్ విషయంలో మార్కెట్లో భారీగా కల్తీ జరుగుతోంది. పాల స్థానంలో వెజిటబుల్ ఆయిల్, డిటర్జెంట్లు, యూరియా వంటి రసాయనాలతో కృత్రిమ పనీర్ తయారు చేసి విక్రయిస్తున్నారు. వీటి వాడకం వల్ల కిడ్నీలు, గుండె దెబ్బతినడంతో పాటు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ముప్పు ఉంది. రబ్బరులా సాగే గుణం, కెమికల్ వాసనతో ఉండే కల్తీ పనీర్ను అయోడిన్ టింక్చర్ లేదా కందిపప్పు పొడితో సులభంగా గుర్తించవచ్చు.