రాయచూర్ లో తీవ్ర విషాదం: ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడంతో కలకలం

రిపోర్టర్: అశోక్ స్థలం: రాయచూర్

కర్ణాటకలోని రాయచూర్ లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందడం తీవ్ర సంచలనం సృష్టించిందని పోలీసులు తెలిపారు. జలాల్నగర్ కు చెందిన విష్ణు, ఆయన భార్య అరుణ, ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలోనే ఈ దారుణం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. భార్య, పిల్లలు ఇంట్ లో విగతజీవులుగా పడి ఉండగా, విష్ణు మృతదేహం రైల్వే ట్రాక్ పై లభించింది.