కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర నిప్పులు: నిరుద్యోగులను మోసగించారంటూ ధ్వజం
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకున్న తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సరైన జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా నిరుద్యోగులను ప్రభుత్వం మోసగిస్తోందని ఆమె ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని, రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని అర్హులైన పట్టభద్రులకు పిలుపునిచ్చారని బంజారాహిల్స్ కార్యకలాపాల సందర్భంగా కవిత స్పష్టం చేశారు.