పిఠాపురంలో ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు: మహిళలకు పవన్ కల్యాణ్ కానుకలు

రిపోర్టర్: సతీష్ స్థలం: కాకినాడ

కాకినాడ జిల్లా పిఠాపురంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నియోజకవర్గంలోని 10 వేల మంది మహిళలకు పసుపు, కుంకుమలతో పాటు చీరలను ప్రత్యేక కానుకలుగా పంపారు. ఎమ్మెల్యే పంతం నానాజీ, ఇతర నేతల పర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకల్లో వేలాది మంది మహిళలు నిష్ఠతో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.