అమెరికా ఆధ్వర్యంలోని 6జీ టెక్నాలజీ కూటమిలో చేరిన భారత్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: India
అమెరికా ప్రారంభించిన నెక్ట్స్ జనరేషన్ 6జీ వైర్‌లెస్ నెట్‌వర్క్ గ్లోబల్ పార్ట్‌నర్‌షిప్‌లో భారత్ అధికారికంగా భాగస్వామిగా చేరింది. డిజిటల్ భద్రతను పెంపొందించడం, సాంకేతిక ఆవిష్కరణలను వేగవంతం చేయడమే ఈ కూటమి ప్రధాన లక్ష్యం. అమెరికా, బ్రిటన్, జర్మనీ, జపాన్ సహా మొత్తం 26 దేశాలు ఇందులో సభ్యత్వం కలిగి ఉన్నాయి. 2030 నాటికి 5జీ స్థానంలో 6జీ నెట్‌వర్క్ రానున్న నేపథ్యంలో ఈ ఒప్పందం ప్రాధాన్యం సంతరించుకుంది.