ముఖ్యమంత్రి విజయ్ తీరుపై మండిపడిన అలై

రిపోర్టర్: రమేష్ స్థలం: మధురై

మధురైలో వీ ది లీడర్స్ వ్యవస్థాపకుడు కే అలై ముఖ్యమంత్రి సీ జోసెఫ్ విజయ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లండన్ పెట్టుబడుల పర్యటనతో పాటు మీనాక్షి అమ్మన్ ఆలయ కుంభాభిషేక నిర్వహణలో వైఫల్యాలపై ఆయన విమర్శలు గుప్పించారు. ఉచితంగా ఇవ్వాల్సిన ప్రవేశ పాస్ లు బ్లాక్ మార్కెట్ లో అమ్ముడయ్యాయని, వీఐపీలకే పెద్దపీట వేసి సామాన్య భక్తులను ఇబ్బంది పెట్టారని అలై ఆరోపించారు.